చర్లపల్లి రైల్వే స్టేషన్, చర్లపల్లి (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 16
చర్లపల్లి రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలు బోగీలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లో నిలిపి ఉన్న రైలు బోగీలకు మంటలు అంటుకోవడంతో అవి అగ్నికి ఆహుతవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వివరాలు తెలియాల్సి ఉంది
అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రమాద తీవ్రత, ఆస్తి నష్టం, ప్రాణనష్టం వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారిక సమాచారం అందిన తర్వాత వెల్లడికానున్నాయని అధికారులు తెలిపారు.






