మంచిర్యాల జిల్లా మందమర్రి లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో నూతన ఎమ్మెస్ఎఫ్ మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ టౌన్ గౌరవ అధ్యక్షులు మంతెన సుమన్ మాదిగ, టౌన్ అధ్యక్షులు చిలుముల రాజ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెస్ఎఫ్ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి చిప్పకుర్తి సతీష్ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందిపుచ్చుకుని మాదిగ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటాలకు విద్యార్థులు ఎల్లప్పుడూ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
నూతన కమిటీ సభ్యులు
నూతన మండల అధ్యక్షుడిగా చిప్పకుర్తి మురారి మాదిగ, ఉపాధ్యక్షులుగా సిరికొండ సంగీత్ మాదిగ, జంగాపెల్లి తరుణ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా సిరికొండ అనుష్ మాదిగ, సహాయ కార్యదర్శిగా అంబాల రోషన్ మాదిగ, కమిటీ సభ్యుడిగా రాసకొండ రాజకుమార్ను నియమించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి ఆసంపెల్లి శివకుమార్ మాదిగ, బచ్చలి కిషోర్ మాదిగ పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థుల హక్కుల సాధనతో పాటు వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.






