సిర్పూర్ (టి), 12 November
ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కొమురం భీమ్ మనవడు, సోనేరావ్ వాలా తమ్ముడు అయిన భీంరావ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కొమురం భీమ్ రెండవ మనుమడు, సోనేరావ్ వాలా తమ్ముడు భీంరావ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు.
శనివారం జైనూర్లో ఆటో, బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో భీంరావ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
భీంరావ్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆదివాసీ సమాజంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ వారసత్వ కుటుంబానికి చెందిన భీంరావ్ మృతి పట్ల పలువురు ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
మండలంలోని స్వగ్రామం పెద్దదోబాలో భీంరావ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.






