అమెరికా, యూరప్‌కు చెందిన విమానయాన సంస్థలు చైనాతో చేసుకున్న ఒప్పందాల ద్వారా కీలకమైన అంతరిక్ష, విమానయాన సాంకేతిక పరిజ్ఞానం చైనాకు చేరుతోందని అమెరికా ప్రతినిధుల సభకు చెందిన చైనా వ్యవహారాల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టెక్నాలజీని చైనా తన సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని కమిటీ చైర్మన్ జాన్ మూలెనార్ హెచ్చరించారు.
హనీవెల్, జీఈ ఏరోస్పేస్, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి సంస్థలు చైనా సైనిక సంబంధిత సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసేందుకు అనుమతులు పొందినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో, చైనాకు సున్నితమైన సాంకేతికత ఎగుమతులపై ఆంక్షలు కఠినతరం చేయాలని, చైనా ఏరోస్పేస్ రంగంలో అమెరికా పెట్టుబడులను నియంత్రించాలని, చైనాలో తయారైన విమానాలకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ () ధ్రువీకరణ ఇవ్వకూడదని కమిటీ సిఫార్సు చేసింది. అయితే, తమ కార్యకలాపాలు అమెరికా ప్రభుత్వ అనుమతులతోనే జరుగుతున్నాయని హనీవెల్, జీఈ ఏరోస్పేస్ సంస్థలు స్పష్టం చేశాయి. మరోవైపు, జాతీయ భద్రత పేరుతో వాణిజ్య, సాంకేతిక రంగాలపై ఆంక్షలు విధించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.






