మందమర్రి, 2026-11-20
మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం దరఖాస్తుల ఆహ్వాన కార్యక్రమం మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ఘనంగా జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో, రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కడారి జీవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజలందరూ ఈ బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గణపతి, మండల స్పెషల్ ఆఫీసర్ అనిత, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో మహేష్ తదితర ఉన్నతాధికారులు పాల్గొని పథకం విధివిధానాలను ప్రజలకు వివరించారు. వీరితో పాటు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బానోత్ నీలయ్య, మండల ఉపాధ్యక్షుడు మాస్ సంతోష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


