పాలచెట్టు ప్రాంతం, మందమర్రి (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 16
మందమర్రి పట్టణంలోని సినిమా షూటింగ్ కారణంగా ట్రాఫిక్కు తీవ్ర ఏర్పడింది. రహదారిపై చిత్రీకరణ చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. దీనివల్ల పడుతున్నారు.
మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షూటింగ్ నిర్వాహకులు రహదారిపై ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందులు కలిగేలా చిత్రీకరణ చేపట్టడం వల్ల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా షూటింగ్ నిర్వహణ కోసం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ట్రాఫిక్ అంతరాయం కలిగేలా షూటింగ్ నిర్వహించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.



