మందమర్రి, 15 November
మండలంలోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వార్తా కథనం ప్రచురితమై మూడు రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ చేసినా లైన్ మెన్ నుంచి సరైన స్పందన లభించడం లేదని వాపోతున్నారు.
ప్రచురితమైన కథనంపై స్పందించని అధికారులు, సరఫరా కాని నీరు. మండలంలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని వార్తా కథనం ప్రచురితమై మూడు రోజులు గడుస్తున్నా, నిమ్మకు నీరెత్తినట్లుగా ఇప్పటివరకు మండలంలోని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాలేదు.
ఫోన్ చేస్తే సంబంధిత లైన్మెన్ల నుంచి కనీస స్పందన లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
అసలే మండలాన్ని ఎల్ నినో ప్రభావం కారణంగా కరువు మండలంగా ప్రకటించారు. ఇప్పటినుంచే ఈ పరిస్థితి కొనసాగితే, భవిష్యత్తులో నీటికి ఎంత సమస్య ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ఇప్పటికైనా స్పందించి, నీటి సరఫరా జరిగే దిశగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.






