మంచిర్యాల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలంగాణ ఉద్యమకారులు, ఓయు జేఏసీ నాయకులు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నాయకులు చిప్పకుర్తి రాజు మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు 250 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ పిడమర్తి రవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టి ఎస్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమకారులందరూ మరోసారి ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కులు, సంక్షేమ ఫలాలు సాధించుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడవాలని పిడమర్తి రవి పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేతకాని విద్యార్థి సంఘం నాయకులు జుమ్మిడి గోపాల్, ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు సుందిళ్ల సతీష్, సాయికుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.












