ఉంచాలి (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 11
ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా బియ్యం వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి, ప్రజలకు అందుబాటు ధరల్లోనే బియ్యం విక్రయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం భీమారం, చెన్నూర్ పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా బియ్యం వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి, ప్రజలకు అందుబాటు ధరల్లోనే బియ్యం విక్రయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం భీమారం, చెన్నూర్ పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు, జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకే విక్రయించాలని, తనిఖీ బృందాలకు సహకరించాలని వ్యాపారులను ఆదేశించారు. అనంతరం చెన్నూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, తరగతి గదుల నిర్మాణం, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
తహసిల్దార్ కార్యాలయంలో జీఓ 58, 59 దరఖాస్తులు, భూ సమస్యలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు సదానందం, మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.






