మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామంలో దీపావళి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుంకరి దివ్య, సతీష్ దంపతుల ఆధ్వర్యంలో దుర్గం జ్యోతి ఇందిరమ్మ ఇంటి ప్రాంగణంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కలిసి దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, దీపాల వెలుగులతో నిండాలని సర్పంచ్ దివ్య ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను ఆనందంగా జరుపుకోవడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఎం.డి. ఇసాక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లెబోయిన సంధ్యారాణి, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎంపిటిసి,కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మామిడిగట్టులో ఘనంగా దీపావళి వేడుకలు. సర్పంచ్ దంపతుల ఆధ్వర్యంలో సంబరాలు.
Share:

సారాంశం
ఇందిరమ్మ ఇంటి ప్రాంగణంలో దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకున్న గ్రామస్తులు
ముఖ్య విషయాలు
- మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామంలో దీపావళి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
- గ్రామ సర్పంచ్ సుంకరి దివ్య, సతీష్ దంపతుల ఆధ్వర్యంలో దుర్గం జ్యోతి ఇందిరమ్మ ఇంటి ప్రాంగణంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి.
- ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కలిసి దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
- గ్రామంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, దీపాల వెలుగులతో నిండాలని సర్పంచ్ దివ్య ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

PARVATHI RAJESH
Reporter
Telangana
3ఆర్టికల్స్
36వ్యూస్




